మహేష్ తో గొడవ పడుతా: నమ్రత


హీరో మహేష్ బాబు, హీరోయిన్ నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ‘వంశీ’ అనే సినిమా షూటింగ్ లో వీరు ప్రేమలో పడ్డారు. 17 ఏళ్లుగా వారి కాపురం ప్రశాంతంగా సాగిపోతోంది. ఐతే, అప్పుడప్పుడు మహేష్ బాబుతో తాను గొడవ పడుతాను అని అంటున్నారు నమ్రత.

“గౌతమ్, సితార ఏది అడిగినా నో అని చెప్పరు మహేష్. కానీ, నేను అలా కాదు. వాళ్ళకి ఏది కావాలో, ఏది అవసరం లేదో చూసి ఓకే చెప్తా. నేను నో చెప్తే వాళ్ళు మహేష్ దగ్గరికి వెళ్లి సాధించుకుంటారు. ఈ విషయంలోనే సరదాగా గొడవ పడుతా మా ఆయనతో,” అని తమ కాపురంలోని పదనిసలు బయట పెట్టారు నమ్రత.

మహేష్ బాబుతో పెళ్లి తన జీవితంలో గొప్ప సంఘటన అని ఆమె అభివర్ణించారు. జీవితంలో ఎంతో ఆనందం తెచ్చి పెట్టిందట మహేష్ బాబుతో పెళ్లి, ప్రేమ.

Namrata and Mahesh

అలాగే, మళ్లీ నటించాలన్న కోరిక లేదు అని చెప్పారు నమ్రత. పెళ్లి తర్వాత నటించకూడదని ముందే డిసైడ్ అయ్యారట.

 

More

Related Stories