
హీరోలు జిమ్ లో చేరి కండలు పెంచుతారు. అది కామన్. హీరోయిన్లు కూడా ఫిట్ గా ఉండేందుకు జిమ్ లో కష్టపడుతుంటారు. ఐతే, హీరో, హీరోయిన్లే కాదు ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు ఫిజికల్ ఎక్సర్ సైజు చెయ్యాలిసిందే. ఈ అవగాహన అందరిలో పెరిగింది ఇప్పుడు. అందుకే, 50, 60 ఏళ్ల వయసులో కూడా జిమ్ లో లిఫ్ట్స్ ఎత్తుతూ శ్రమిస్తున్న వారు మనకు తారసపడుతుంటారు.
ఇప్పుడు నమ్రత కూడా జిమ్ లో కసరత్తులు మొదలు పెట్టారు. ఆమెది కూడా 50 ప్లస్ ఏజ్. ఇప్పుడే ఫిట్ గా ఉండడం అవసరం అందుకే ఆమె స్పెషల్ ట్రైనర్ ని పెట్టుకొని జిమ్ లో కష్టపడుతున్నారు.
నమ్రత ఆ ఫోటోలను, వీడియోలను షేర్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ వేదికపై ఇంతకుముందు ఆమె తన భర్త మహేష్ జిమ్మింగ్ ఫోటోలు షేర్ చేసేవారు. ఇప్పుడు తన కసరత్తు చూపిస్తూ మిగతా మహిళలకు స్ఫూర్తినింపుతున్నారు.
నమ్రత కన్నా మహేష్ బాబు మూడేళ్లు వయసులో చిన్నవాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.