- Advertisement -

హీరో నందమూరి బాలకృష్ణ అనగానే మీసం మెలేసి విలన్ లకి ఛాలెంజ్ విసిరే సీన్లు గుర్తొస్తాయి. సినిమాల్లో పౌరుషం చూపే హీరో పాత్రలకు పెట్టింది పేరు బాలయ్య. తొడగొట్టి డైలాగులు కొట్టే బాలయ్య తాజాగా ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో అదే పని చేశారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించిన బాలయ్య రండి చూసుకుందాం అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మంత్రి అంబటికి దగ్గరగా వెళ్లి మీసం మేలుస్తూ తొడగొట్టారు నందమూరి బాలకృష్ణ.
బాలకృష్ణ పై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేసి మందలించారు. అసెంబ్లీలో మీసాలు మెలేయడం వంటివి చెయ్యకూడదని చెప్పారు సభలో హుందాగా నడుచుకోవాలని బాలయ్యకి సూచించారు. ఇంకోసారి ఇలాంటివి చేస్తే ఊరుకోమన్నారు.
మొత్తానికి బాలయ్య ఈ రోజు అసెంబీలో హైలెట్ అయ్యారు.