- Advertisement -

కళ్యాణ్ రామ్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది ‘బింబిసార’. మొదటివారం పూర్తి చేసుకున్న ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రెండో వారంలోకి అడుగుపెట్టింది. రెండో వీకెండ్ కూడా కలెక్షన్లు బాగున్నాయి.
ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ ఈ సినిమాని వీక్షించారు. ప్రసాద్ ల్యాబ్ లో బాలయ్య, ఆయన కుటుంబ సభ్యులు ఈ సినిమాని చూశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా బాలయ్యతో సినిమా చూశారట.
సినిమా బాగా నచ్చింది అని బాలయ్య నిర్మాత, హీరో కళ్యాణ్ రామ్ ని మెచ్చుకున్నారు. ‘బింబిసార’ పాత్రలో బాగా నటించావు అని కళ్యాణ్ రామ్ కి బాలయ్య కాంప్లిమెంట్ ఇచ్చారట. దర్శకుడు వశిష్టని కూడా బాలయ్య అభినందించారు.
మరోవైపు ఈ సినిమా సక్సెస్ సంబరాలని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.