బాలయ్యకది సెంటిమెంట్ అయిందా?

Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణకి సెంటిమెంట్లు ఎక్కువ. పూజలు, పునస్కారాల పట్టింపులూ ఎక్కువే. ముహుర్తం చూసుకొని బయటికి అడుగుపెట్టడం, కలిసొచ్చిన పనులే చెయ్యడం వంటివి బాలయ్య స్టయిల్.

సినిమాల షూటింగ్ కి సంబంధించి కూడా ఆయనకి ఇటీవల ఒక సెంటిమెంట్ మొదలైంది అని ఇండస్ట్రీ టాక్.

బాలయ్య తాజాగా తన 109వ (#NBK109) సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలైంది. యాక్షన్ సీన్ తీస్తున్నారు. బాలయ్య కోరిక మేరకు ఫైటింగ్ సన్నివేశంతో సినిమా షూటింగ్ మొదలుపెట్టింది టీం.

బాలయ్యకి ఇటీవల యాక్షన్ సీన్ తో షూటింగ్ మొదలుపెట్టడం సెంటిమెంట్ గా మారింది. “అఖండ”, “వీర సింహ రెడ్డి” చిత్రాలకు అలాగే చేశారట. ఫైటింగ్ సీన్ తో సినిమా మొదలుపెడితే కలిసి వస్తుందని ఎవరో చెప్పారని టాక్. అందుకే, బాలయ్య ఇక ఇదొక సెంటిమెంట్ గా మార్చేశారట.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారో చూడాలి.

Advertisement
 

More

Related Stories