నందమూరి హీరోలకి లక్కీ టైం!

Nandamuri Heroes

నందమూరి హీరోలకు సడెన్ గా భారీ హిట్స్ దక్కుతున్నాయి. గతేడాది నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అందుకున్నారు. ‘అఖండ’ సినిమాతో ఆ విజయం దక్కింది బాలయ్యకి. బోయపాటి తీసిన ఆ మూవీ దాదాపు ప్రపంచవ్యాప్తంగా 68 కోట్ల వసూళ్లు (షేర్) అందుకొంది. వసూళ్ల పరంగా బాలయ్య కెరీర్ లో ఇదే బిగ్ హిట్.

ఇక ఈ ఏడాది రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తీసిన చిత్రం కూడా సంచలన విజయం సాధించింది. ఇది రాజమౌళి సినిమా కాబట్టి ఎక్కువగా ఆయనకే క్రెడిట్ పోతుంది. కానీ ఇందులో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరికీ పాన్ ఇండియా లెవల్లో మంచి పేరు వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల వసూళ్లు (నెట్) అందుకొంది.

తాజాగా కళ్యాణ్ రామ్ కి కూడా హిట్ దక్కింది. ‘బింబిసార’ మొదటి వీకెండ్ వసూళ్లతోనే దాదాపుగా పెట్టుబడిని లాగేసింది. మరో వారం ఆడితే, ఈ సినిమా ఫైనల్ వసూలు ఎంత అనేది తేలుతుంది. ప్రస్తుతానికి కళ్యాణ్ రామ్ కెరీర్ కి ఇది ఊపు తెచ్చింది.

మొన్నటివరకు రేసులో వెనుకబడ్డారు అనుకున్న నందమూరి హీరోలు ఇప్పుడు ఫామ్ లోకి వచ్చినట్లే.

 

More

Related Stories