ప్చ్.. ఎంత చూపించినా లాభం లేదా?

హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిపోదాం అనుకుంది. కానీ కెరీర్ పరంగా తీసుకున్న రాంగ్ డెసిషన్స్ కారణంగా హీరోయిన్ గా క్లిక్ అవ్వలేకపోయానని స్వయంగా నందినీ రాయ్ ఆమధ్య చెప్పుకొచ్చింది. అదే టైమ్ లో డీప్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, మళ్లీ కోలుకొని ఇప్పుడిలా ఉన్నానని వెల్లడించింది. అయితే ఆమె చేస్తున్న కొత్త ప్రయత్నాలు కూడా బొత్తిగా కలిసిరావడం లేదు.

నలుగుర్ని ఆకర్షించేందుకు నందినీరాయ్ అందాల ఆరబోతనే నమ్ముకుంది. మంచి పాత్రలు దొరకనప్పుడు ఎవరైనా ఇదే చేస్తారు. నందినీరాయ్ కూడా అదే చేసింది. కాకపోతే ఆ అందాలు ఇప్పుడు అడవి కాచిన వెన్నెల మాదిరి తయారయ్యాయి.

Nandini Rai

Also Check: Nandini Rai Photos

విప్పడంలో పీక్స్ చూపిస్తోంది కానీ ఆఫర్లు మాత్రం పలకరించడం లేదు. ఆమె ఇనస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అన్నీ హాట్ హాట్ ఫొటోలే. అయితే ఆ హాట్ నెస్ ఆమెకు సినిమా ఆఫర్లు తెచ్చిపెట్టడం లేదు. చివరికి మెట్రోకథలు అనే వెబ్ డ్రామాలో కూడా అదే రేంజ్ లో నటించినా నందినీకి ఇప్పటివరకు ఒక్క ఆఫర్ రాకపోవడం బాధాకరం.

Related Stories