మీడియాని ఫూల్ చేసిన నందు

Nandu and Rashmi Gautam

బి.బి గురించి ఒక ప్రకటన ఉంది. అది రేపు చెప్తా అని హీరో నందు మొన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. బుర్రలో కాస్త గుజ్జు ఉన్నవారెవరికైనా అది ఒక గిమ్మిక్ అని తెలిసిపోయింది. కానీ మీడియా సంస్థలు.. నందు “బిగ్ బాస్ 4″లో పాల్గొంటున్నాడు అని కథలు అల్లేశాయి. తనే తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా అప్ డేట్ చేశాడని హోరెత్తించాయి.

“బిగ్ బాస్”లో పాల్గొనే వారెవ్వరూ అధికారికంగా చెప్పుకోరు. చెప్పుకుంటే… బిగ్ బాస్ లోకి తీసుకోరు. కానీ మీడియా అతని గిమ్మికులకు ఫూల్ అయింది.

నందు ఇప్పుడు అసలు విషయం బయట పెట్టాడు. నందు, ర‌ష్మీ జంట‌గా ఒక సినిమా రూపొందుతోంది. ఆ మూవీకి “బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్” అనే టైటిల్ పెట్టారు. “బొమ్మ బ్లాక్ బస్టర్” (బి.బి) కోసం ఈ గేమ్ ఆడాడు నందు. టైటిల్ ప్రకటనకు కాస్త క్రేజ్ రావాలని ఇలా చేశాడు. తను సక్సెస్. మీడియా ఫూల్.

Related Stories