నా కామెడీ టైమింగ్ కొత్తగా ఉంటుంది

నాని నటన ఎంత సహజంగా ఉంటుందో, అతడి కామెడీ కూడా అంతే నేచురల్ గా ఉంటుంది. గతంలో చాలా సినిమాల్లో నాని కామెడీ టైమింగ్ చూశాం. అయితే అవన్నీ ఒకెత్తు, అంటే సుందరానికి మరో ఎత్తు అంటున్నాడు నాని. ఈసారి తన కామెడీ మరింత కొత్తగా ఉంటుందని చెబుతున్నాడు.

“అంటే సుందరానికీ’లో చాలా భిన్నమైన టైమింగ్ ఉంటుంది. ఇప్పటి వరకూ ఇలాంటి టైమింగ్ ఉన్న పాత్ర చేయలేదు. నా పాత సినిమాల డైలాగ్ టెంప్లేట్ కి ఈ సినిమా ఎక్కడా మ్యాచ్ అవ్వదు. వివేక్ అలా మ్యాచ్ కాకుండా కొత్తగా రాసుకున్నాడు. నేను పాత నానిలా చేద్దామని అనుకున్నా చేయలేని విధంగా రాసుకున్నాడు. చాలా హిలేరియస్ గా ఉంటుంది. కొత్త నాని, కొత్త టైమింగ్ చూస్తారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.”

ఈ సినిమాలో సుందర్ అనే బ్రాహ్మణ కుర్రాడి పాత్ర పోషించాడు నాని. అమాయకుడైన సుందర్, ఓ క్రిస్టియన్ అమ్మాయి ప్రేమలో ఎలా పడ్డాడు.. కుటుంబాల్ని ఒప్పించి ఇద్దరూ ఎలా ఒకటయ్యారనేది ఈ సినిమా స్టోరీ.

ఈనెల 10న విడుదలకాబోతున్న ఈ సినిమాతో నజ్రియా నజీమ్ (రాజా-రాణి ఫేమ్) టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. వివేక్ ఆత్రేయ డైరక్ట్ చేసిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తెరకెక్కించారు.

 

More

Related Stories