నాని నార్త్ ఇండియా టూర్!

‘దసరా’ సినిమాపై నాని గట్టి నమ్మకంతో ఉన్న విషయం అర్థమవుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. మొదటి సారి తన సినిమాని నార్త్ ఇండియాలో ప్రమోట్ చేస్తున్నారు నాని. ఈ రోజు హోలీ సందర్భంగా ముంబైలో ఈ సినిమా ఈవెంట్ జరుగుతోంది. అక్కడికి నాని వెళ్ళారు. ముంబై మీడియాతో ఇంటరాక్ట్ అవుతారు.

అలాగే లక్నోలో హిందీ ట్రైలర్ ని విడుదల చెయ్యాలనేది ప్లాన్. ముంబై, లక్నోతో పాటు నార్త్ ఇండియా మార్కెట్ కి కీలకమైన మరికొన్ని నగరాల్లో తన సినిమాని ప్రమోట్ చేసేందుకు నాని రెడీ. దాదాపు వారం రోజులు నార్త్ ఇండియా టూర్ వేస్తారు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది ‘దసరా’లో. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా గోదావరిఖని నేపథ్యంగా సాగే చిత్రం. ఈ కథ చాలా గొప్పగా ఉందని నాని నమ్ముతున్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కథ అద్భుతంగా చెప్పడమే కాదు గ్రిప్పింగ్ గా సినిమాని నిర్మించినట్లు టాక్.

నాని ఇంతకుముందు ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాతో సౌత్ ఇండియా మార్కెట్ కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు ‘దసరా’తో నార్త్ ఇండియా మార్కెట్ పై కన్నేశారు.

‘దసరా’ నాని ఊహించినట్లుగా భారీ హిట్ అయితే నాని మార్కెట్ రేంజ్ మరింతగా పెరుగుతుంది. తనకంటూ కొంత నార్త్ ఇండియన్ మార్కెట్ వస్తే తన సినిమాలకు బడ్జెట్ మరింత పెరిగి… ఇంకా భారీ కాన్వాస్ ఉన్న కథలు ఎంచుకోవచ్చు అనేది నాని ఆలోచన. అందుకే ఈ ప్రయత్నం, ఈ ప్రొమోషన్.

 

More

Related Stories