పెద్ద హీరోలకి సమానంగా సంపాదన!

- Advertisement -
Tuck Jagadish


పెద్ద హీరోలు 30 నుంచి 50 కోట్లు తీసుకుంటున్నారు. కానీ పెద్ద హీరోలు ఏడాదికి ఒక సినిమా విడుదల చేస్తే గొప్ప అన్నట్లుగా తయారు అయింది. మిడిల్ రేంజు హీరోల కూడా అలాగే ఉన్నారు. విజయ్ దేవరకొండ లాంటి హీరో నుంచి 20 నెలల్లో ఒక్క సినిమా కూడా రాలేదు. ఐతే, వీరిలో నాని డిఫరెంట్.

నాని ఒక్కో సినిమాకి దాదాపు 10 కోట్లు తీసుకుంటాడు. ఈ కరోనా టైంలో కూడా తన సినిమాలని రిలీజ్ చేశాడు. గతేడాది ‘వి’, ఈ ఏడాది ‘టక్ జగదీష్’ చిత్రాలు డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో వచ్చేలా చేసి… తన ఏడాదికి కనీసం ఒకటైనా విడుదల ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అంతే కాదు, ఈ డిసెంబర్ లో ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాని థియేటర్లోకి తెస్తున్నాడు. అంటే ఈ ఏడాది అతని సంపాదన 20 కోట్లు.

వచ్చే ఏడాది ‘అంటే సుందరానికి’, ‘దసరా’ అనే సినిమాలతో పాటు మరో మూవీని విడుదల చేస్తాడు. 2022లో నానికి 30 కోట్ల వరకు వస్తాయి. ఇంకా ఇవి కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నాడు. అంటే పెద్ద హీరోల సంపాదనకు నాని ఎర్నింగ్ ఏమి తీసిపోదు.

నాని స్పీడ్ గా సినిమాలు పూర్తి చేస్తాడు. అలాగే డిజాస్టర్స్ ఇవ్వట్లేదు ఇటీవల కాలంలో. దాంతో, నాని మార్కెట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అదే అతని ఆర్జన రహస్యం.

More

Related Stories