పాన్ ఇండియా కుదరలేదు

Dasara

నాని పాన్ ఇండియా కలలు కన్నాడు. ‘దసరా’ సినిమా తనకి పాన్ ఇండియా మార్కెట్ తెస్తుందని భావించాడు నాని. హిందీ వర్షన్ కోసం చాలా కష్టపడ్డాడు. లక్నో, అహ్మదాబాద్, ముంబై సహా ఇతర నగరాల్లో బాగా తిరిగాడు. కానీ, తెలుగు వర్షన్ మాత్రమే విజయం సాధించింది.

హిందీ వర్షన్ నుంచి వచ్చింది ఏమి లేదు. హిందీ వర్షన్ ప్రచారం కోసం పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు.

ఇక తమిళ్, మలయాళం వర్షన్ లు కూడా ఏమి తీసుకురాలేదు. పాన్ ఇండియా కల ఇంకా నెరవేరలేదు. కాకపోతే, ఈ సినిమా నుంచి మొదలు పెట్టిన పాన్ ఇండియా ప్రయత్నం ఎప్పుడో అప్పుడు ఫలితం తెస్తుంది నాని నమ్మకంగా ఉన్నాడు.

స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అన్నట్లుగా మెల్లగా విజయం సాధిస్తాను అని అనుకుంటున్నాడు. అందుకే, ‘దసరా’ వల్ల పాన్ ఇండియా రాకపోయినా ఇప్పుడు తనకి పెద్ద విజయం దక్కింది అని ఆనందంగా ఉన్నాడు.

 

More

Related Stories