నానిని పుకార్లు భయపెడుతున్నాయి!

Nani


హీరో నానికి భయం  మొదలైంది. ఎందుకంటే ఇటీవల ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యారు. ఒక సినిమా వేదికపై “థియేటర్లు మన సంస్కృతిలో భాగం” అంటూ ఉపన్యాసాలు దంచారు. ఆ లెక్షర్ ఇచ్చిన నెలకే తన సినిమాని ఓటిటి వేదికపై విడుదల చేస్తున్నారు. దాంతో, నాని బాగా ట్రోలింగ్ కి గురయ్యారు. అందుకే, మొన్న పెద్ద లేఖ పెట్టారు. నన్ను విమర్శించిన ఏమనుకోను … నిర్మాతల శ్రేయస్సు కోసం నేను వారి నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తాను అని ఆ లేఖలో పేర్కొన్నారు.

నాని జెన్యూన్ గానే చెప్పారు. కానీ జనం మాత్రం ట్రోలింగ్ ఆపడం లేదు.

“టక్ జగదీష్ విషయంలో అసలు ఏమి జరిగింది అంటే….” అనే కథనాలు కూడా వెబ్ సైట్ లలో రాయించి కొంచెం డ్యామేజ్ కంట్రోల్ కి నాని ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ పుకార్లు ఆగడం లేదు. ఇప్పటికే రెండు సినిమాలను ఓటిటికి ఇచ్చిన నాని ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా అదే పని చేస్తున్నాడు అని రూమర్లు పుట్టుకొచ్చాయి. దాంతో వెంటనే భయపడి అలాంటిదేమి లేదని చెప్తోంది నాని టీం.

“శ్యామ్ సింగ రాయ్” సినిమా థియేటర్లలోనే విడుదల అని చెప్తున్నారు నాని. ఐతే, విడుదల టైంకి చూద్దాం లే… అన్నట్లుగా ఉంది ట్రోలర్స్ వ్యవహారం. “వి”, “టక్ జగదీష్” విషయంలో థియేటర్లోనే విడుదల చేస్తామని చెప్పారు కదా అని ట్రోలర్స్ ప్రశ్నిస్తున్నారు. అందుకే, నానికి తొలిసారిగా ట్రోలర్స్ వల్ల భయం పట్టుకొంది. “శ్యామ్ సింగ రాయ్” థియేటర్లోనే విడుదల అవుతుందని నాని చెప్పినా జనం నమ్మలేరిప్పుడు. “నాన్న పులి” కథలో రెండుసార్లు అబద్దాలు ఆడిన కుర్రాడు మాటలా మారింది నాని మాట.

ఇదంతా… ‘తిమ్మరుసు’ అనే సినిమా ఫంక్షన్లో ఇచ్చిన ఉపన్యాసం వల్లే. ఐతే, ఈ సారి నాని “శ్యామ్ సింగ రాయ్”  ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటిటికి ఇవ్వకపోవచ్చు. లేదంటే ఇంకా ట్రోలింగ్ కి గురవుతారు.

Advertisement
 

More

Related Stories