నానికి ఎందుకింత తొందర?

Nani

నాని నటించిన ‘టక్ జగదీష్’ ఇంకా విడుదల కాలేదు. సరిగ్గా రిలీజ్ టైంకి కొవిడ్ సెకండ్ వేవ్ ఉప్పెనలా వచ్చిపడింది. దాంతో అన్ని సినిమాలతో పాటు ‘టక్ జగదీష్’ కూడా వాయిదా పడింది. ఇలాంటి టైంలో నాని షూటింగ్ విషయంలో తొందరపడడం విచిత్రంగా ఉంది.

నాని ప్రస్తుతం ‘శ్యామ్ సింగ రాయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకొంది. ఇంకో నెల రోజుల్లో షూటింగ్ కి గుమ్మడికాయ కొడుతారట. అంటే… ఒక సినిమా పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది, ఇంకోటి పూర్తి కావొస్తోంది. ఈ రెండు సినిమాల రిలీజ్ పరిస్థితి ఏంటో తెలియనప్పుడు మరో సినిమా మొదలు పెడుతారా?

నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా జంటగా రూపొందుతోన్న ‘అంటే సుందరానికి’ అనే సినిమా షూటింగ్ ఈ రోజు మొదలైంది. నజ్రియా ఈ రోజు హైదరాబాద్ కి వచ్చి షూటింగ్ లో పాల్గొంది. కరోనా టైంలో నాని ఎందుకింత తొందరపడుతున్నాడు? ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నాడు?

నానికి స్పీడ్ గా సినిమాలు పూర్తి చేసే అలవాటు ఉంది. దానివల్ల కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. ఐతే, కరోనా టైంలో మరి ఇంత స్పీడ్ అవసరమా?

More

Related Stories