- Advertisement -

హీరో నాని ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగింది. ఆ విషయాన్ని నాని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తానూ, తన కుమారుడు దేవుడికి సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఫోటోతో పాటు మరి కొన్నింటిని నాని షేర్ చేశారు.
నాని తల్లితండ్రులు కూడా ఈ పూజలో పాల్గొన్నారు.
కరోనా లాక్డౌన్ కి ముందే నాని కొత్త విల్లాలోకి షిఫ్ట్ అయ్యారు. కెరీర్ పరంగా, సంపాదనపరంగా మంచి స్థితిలో ఉన్న హీరో నాని. ఐతే, ఇటీవల ఆయన నటించిన సినిమాలు థియేటర్లలో భారీ విజయం సాధించలేదు. ‘శ్యామ్ సింగ రాయ్’ యావరేజ్ గా నిలవగా, ‘అంటే సుందరానికి’ అమెరికాలో తప్ప మిగతా చోట్లా ఆడలేదు.
ఇప్పుడు నాని ఒక భారీ చిత్రం చేస్తున్నారు. ‘దసరా’ అనే ఈ సినిమాతో హీరోగా ఒక మెట్టు ఎక్కుతాను అని ధీమాగా ఉన్నారు.