నాని పీక్ పబ్లిసిటీ ఎందుకంటే…!

Nani in Tuck Jagadish movie

నాని ఈసారి ప్రమోషన్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. వరుసగా ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ నిర్వహిస్తున్నాడు. నాని నటించిన ‘టక్ జగదీష్’ ఈ నెల 23న విడుదల కానుంది. ఇప్పటికే టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉగాదికి ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. అయినా… ఇంకా బోలెడన్ని ప్రమోషన్స్ ప్లాన్ చేశాడట. ఎందుకంటే… రెండు సినిమాల మధ్య నలిగిపోవద్దనేది అతని ప్లాన్.

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఈ వీకెండ్ విడుదల అవుతోంది. ఇప్పటికే ఈ మూవీపై హైప్ ఫుల్ గా ఉంది. నెక్స్ట్ వీక్ శేఖర్ కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ‘సారంగ దరియా’ పాట వైరల్ కావడంతో ‘లవ్ స్టోరీ’కి బజ్ మాములుగా లేదు. అందుకే.. నాని తన సినిమాకి ఎక్కువ పబ్లిసిటీ కావాలని కోరుకుంటున్నాడు.

అలా చెయ్యకపోతే, ‘టక్ జగదీష్’పై జనం ఫోకస్ పడదు. నానికి ఇటీవలి కాలంలో అన్ని యావరేజ్ సినిమాలే వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ బ్లాక్ బస్టర్ పది చాలా రోజులైంది. ‘టక్ జగదీష్’తో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాలంటే పబ్లిసిటీ పీక్ లో ఉండాలి మరి.

More

Related Stories