ఇంకోటి రెడీ చేస్తున్న నాని

Nani


నాని నటించిన “టక్ జగదీష్” గత వారం విడుదలైంది. “శ్యామ్ సింగ రాయ్” షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ‘అంటే సుందరానికి’ అనే మరో సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయింది. దాంతో, ఇంకో సినిమా ప్రకటించేందుకు రెడీ అవుతున్నాడు నాని.

శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడు గోదావరిఖని నేపథ్యంగా సాగే కథ చెప్పాడు. అది నానికి బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పాడు. మొదటిసారిగా నాని తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పనున్నాడు. ఈ దసరాకి ఈ సినిమాని ప్రకటిస్తాడట నాని.

ఏడాదికి మూడు సినిమాలు చెయ్యాలనే టార్గెట్ తో నాని వెళ్తున్నాడు. కరోనా కారణంగా ఈ రెండేళ్లు కొంత ప్లానింగ్ దెబ్బతింది. ఇప్పుడు దాన్ని కవర్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు.

 

More

Related Stories