నజ్రియా ఇష్టాలు బయటపెట్టిన నాని

నజ్రియాకు ఏ హాలిడే స్పాట్ ఇష్టం. ఆమె రాశి ఏంటి? నజ్రియా ఎక్కువగా వాడే యాప్ ఏంటి? ఇవన్నీ నజ్రియా చెబితే అందులో స్పెషల్ ఏముంటుంది? ఆమె ఇష్టాఇష్టాల్ని నాని చెబితే అది స్పెషల్. ఇప్పుడదే జరిగింది. నజ్రియా ఇష్టాఇష్టాల్ని నాని బయటపెట్టాడు. తనకు సంబంధించిన విషయాల్ని నాని అలా చెప్పేస్తుంటే, ఆశ్చర్యపోవడం నజ్రియా వంతయింది.

అంటే సుందరానికి ప్రమోషన్ సందర్భంగా నజ్రియా-నానితో  చిన్న చిట్ చాట్ సెషల్ ఏర్పాటుచేశారు. ఇద్దరూ ఒకర్నొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారనే యాంగిల్ లో ప్రశ్నలు వదిలారు. ఈ సందర్భంగా నజ్రియాను ఆశ్చర్యపరిచాడు నాని.

నజ్రియాకు యూరోప్ అంటే ఇష్టమని, ఆమెది ధనుస్సు రాశి అని, నజ్రియా ఎక్కువగా ఇనస్టాగ్రామ్ వాడుతుందంటూ టకటకా చెప్పేశాడు. అయితే అదే సందర్భంలో నాని గురించి మాత్రం నజ్రియా చెప్పలేకపోయింది. నానికి దళపతి అనే సినిమా చాలా ఇష్టమని మాత్రమే చెప్పగలిగింది.

అంటే సుందరానికి సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. లిరికల్ సాంగ్స్ విడుదల చేస్తున్నారు. ఇప్పుడిలా డిఫరెంట్ ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే గ్రౌండ్ ఈవెంట్స్ కూడా చేయబోతున్నారు. దసరా సినిమా కోసం గుబురు గడ్డం పెంచాడు నాని. ఆ గెటప్ తోనే అంటే సుందరానికి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. జూన్ 10న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.

 

More

Related Stories