మ‌ళ్లీ చెప్తున్నా ఈ క్రిస్ట‌మ‌స్ మ‌న‌దే!

Sai Pallavi, Nani and Krithi Shetty


హీరో నాని నటించిన ‘శ్యామ్ సింగ‌రాయ్’ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సినిమా ప్రొమోషనల్ ఈవెంట్ మంగళవారం వరంగల్ లో జరిగింది. ఈ సినిమాపై నాని చాలా ధీమాగా ఉన్నారనిపిస్తోంది. “ఒక మంచి సినిమా తీస్తే ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. శ్యామ్ సింగ‌రాయ్ నాకు ఇచ్చిన ఫీలింగ్‌ అదే. .మ‌ళ్లీ చెప్తున్నా ఈ క్రిస్ట‌మ‌స్ మాత్రం మ‌న‌దే,” అని నాని అభిమానులను ఉద్దేశించి అన్నారు.

సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్.

నాని మాట్లాడుతూ.. ‘కళ్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. అదే మీరు.. అదే నేను.. అదే పల్లవి.. అంతకు మించిన రిజల్ట్ ఈ 24న చూడబోతోన్నారు. ఎంసీఏ బ్లాక్ బస్టర్ కదా? అని ఇక్కడకు రాలేదు. ఇక్కడ ఏదో ఒక పాజిటివ్ ఉంది.. మళ్లీ అప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. దర్శకుడు రాహుల్ చేసిన మొదటి సినిమాను నేను చూడలేదు. కానీ ఈ రోజు నా సినిమాను చూశాను. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయ్యే సత్తా ఉంది. నిర్మాత వెంకట్ గారు మమ్మల్ని సొంత పిల్లల్లా చూసుకున్నారు. ఆయనతో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ఉంది. సాయి పల్లవి నుంచి మీరు ఎంత డ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారో అందరికీ తెలుసు. మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ సాంగ్ ఒకటి ఉంది. రెండు మూడు రోజుల్లో ఆ పాటను విడుదల చేస్తాం. ఆమె పాత్రతో అందరూ ప్రేమలో పడిపోతారు. కృతి శెట్టి చేసింది ఒక్క సినిమానే. ఈ పాత్రను అర్థం చేసుకుంటుందా? లేదా? అని అనుకున్నాను. కానీ ప్రతీ రోజూ సెట్‌లో ఆమె తన పాత్ర కోసం కేర్ తీసుకునేది. భవిష్యత్తులో ఆమె ఇంకా ఉన్నత స్థానానికి చేరుకుంటుంది,” అని ధీమాగా చెప్పారు నాని.

“ఈ డిసెంబర్ 24న టాప్ లేచిపోవాల్సిందే. రెండేళ్ల తరువాత థియేటర్లోకి వస్తున్నా.. మీరు మిస్ అయ్యారని తెలుసు. నేను కూడా మిస్ అయ్యాను. కానీ ఈ సారి మాత్రం మిస్ అయ్యే చాన్సే లేదు’ అని అన్నారు నాని.

Advertisement
 

More

Related Stories