నాని ఇప్పటికైనా మారుతాడా?

Nani

నాని ఎన్నో సినిమాలు చేశాడు. ఎన్నో హిట్స్ కూడా కొట్టాడు. కానీ అతడి సినిమాల్లో మేకోవర్ మాత్రం పెద్దగా కనిపించదు. చిన్న చిన్న మార్పులు మినహా, దాదాపు అన్ని సినిమాల్లో నాని ఒకేలా కనిపిస్తాడు. మహా అయితే హెయిర్ స్టయిల్, గడ్డం మారుస్తాడంతే. అతడు ఎంచుకునే పాత్రలు అలా ఉంటాయి. కానీ ఫస్ట్ టైమ్ నాని నుంచి ఫుల్ లెంగ్త్ మేకోవర్ ను చూడబోతున్నాం అని అంటున్నారు.

డిసెంబర్ నుంచి సెట్స్ పైకి రాబోతున్న “శ్యామ్ సింగరాయ్” సినిమాలో సరికొత్త నానిని చూడబోతున్నారని చెబుతున్నాడు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. సినిమాలోని ఓ పాత్రలో నాని గెటప్ చాలా కొత్తగా ఉంటుందని, అతడి కెరీర్ లోనే డిఫరెంట్ గెటప్ గా నిలిచిపోతుందని చెబుతున్నాడు.

కేవలం కొత్తగా చూపించడం కోసం నానితో అలాంటి ప్రయోగం చేయడం లేదని, సినిమాకు ఆ గెటప్ కు చాలా లింక్ ఉంటుందని అంటున్నాడు ఈ డైరక్టర్.

Shyam Singha Roy

‘V’ సినిమాలో కొంచెం కొత్తగా కనిపించడానికి ట్రై చేశాడు నాని. కానీ అది పూర్తిస్థాయి మేకోవర్ మాత్రం కాదు. “శ్యామ్ సింగరాయ్” లో మాత్రం ఫుల్ లెంగ్త్ మేకోవర్ ఉంటుందట. సూర్య, విక్రమ్ తమ సినిమాల్లో ట్రై చేసినట్టు నాని కూడా కొత్తగా ట్రై చేస్తాడట.

సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమా చేతులమారిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ బడ్జెట్ పరిమితులు విధించడంతో నానికి చిర్రెత్తుకొచ్చింది. అందుకే టోటల్ ప్రాజెక్టును తీసుకెళ్లి నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ కు అప్పగించాడని టాక్.

Related Stories