
తెలంగాణ థియేటర్ల యజమానుల సంఘం నిన్న హీరో నానికి వ్యతిరేకంగా చాలా ఘాటుగా కామెంట్స్ చేసింది. “టక్ జగదీష్” సినిమా డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల కానుండడం వారి ఆగ్రహానికి ఒక కారణమైతే, అది సెప్టెంబర్ 10న ప్రీమియర్ అవుతుండడం మరో కారణం.
సెప్టెంబర్ 10న థియేటర్లలో “లవ్ స్టోరీ” రిలీజ్ కానుంది. దానికి పోటీగా ఓటిటి డేట్ ని ఎలా ప్రకటిస్తారు అని తెలంగాణ థియేటర్ల సంఘం సభ్యులు మండిపడ్డారు. కానీ, తమ ఓటిటి వేదికపై ఏ సినిమాని ఎప్పుడు విడుదల చెయ్యాలి అనేది ఆయా ఓటిటి సంస్థల టీమ్స్ నిర్ణయిస్తాయి. అందులో హీరోల ప్రమేయం ఉండదు. ఈ విషయంలో నాని తప్పుపట్టడం కరెక్ట్ కాదని అందరూ అంగీకరించారు. దాంతో, ఆ సంఘం ఇప్పుడు నానికి క్షమాపణలు చెప్పింది.
వారి విమర్శలు కొంత హద్దుమీరడంతో నానికే ఎక్కువ సపోర్ట్ లభించింది. చివరికి ఈ వివాదంలో నాని విజయం సాధించారు.
మన దగ్గరే కాదు గతేడాది సూర్య తన ‘ఆకాశం నీ హద్దు రా’ సినిమాని డైరెక్ట్ గా ఓటిటి వేదికపై విడుదల చేసినప్పుడు తమిళనాడు థియేటర్ల ఓనర్స్ గగ్గోలు పెట్టారు. సూర్యని తిట్టారు. థియేటర్ల మనుగడకి సవాల్ విసురుతున్న ప్రస్తుత పరిణామాలతో ఇలాంటి వివాదాలు తలెత్తుతున్నాయి. కానీ, కరోనా సినిమా వ్యాపారాన్ని పూర్తిగా మార్చేసింది. సో… ఇప్పుడు థియేటర్లతో పాటు ఓటిటి డైరెక్ట్ రిలీజులు ఉంటాయి. ఇది పరిణామాన్ని నిర్మాతలు, థియేటర్ల యజమానులు అర్థం చేసుకొని ఇక వ్యాపారం చెయ్యాలి.