హిట్ కోసం స్కెచ్చేసిన నాని

Nani


నాని హీరోగా తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. మిడిల్ రేంజ్ హీరోల్లో నానిది మంచి స్థానం. కానీ, ఒక మంచి బ్లాక్ బస్టర్ పడి కాలమే అయింది. పైగా, ఇటీవల రెండు సినిమాలు కూడా థియేటర్లలో విడుదల కాలేదు. డైరెక్ట్ గా ఓటిటి వేదికపైనే స్ట్రీమ్ అయ్యాయి.

ఇప్పుడు తన సత్తాని మరోసారి చూపించుకోవాల్సిన అవసరమొచ్చింది. అందుకే, అభిమానులతో మీటింగులు ఏర్పాటు చేసుకున్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దాదాపు రెండు వేల మంది అభిమానులను పిలిపించుకొని వారికి డిన్నర్ ఇచ్చారు. గిఫ్టులు అందచేశారు. ఇటీవల అల్లు అర్జున్ వంటి హీరోలు ఇదే పద్దతిని పాటించారు. ఇప్పుడు నాని కూడా థియేటర్లో భారీ హిట్ కోసం అభిమానులతో కనెక్షన్ పేరుతో ఈ స్కెచ్చేశారు.

డిసెంబర్ 24న విడుదల కానుంది నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ సినిమా నిర్మాణంలో ఆయన కూడా భాగస్వామి. ‘పుష్ప’ విడుదలైన వారానికే ఈ సినిమా విడుదల అవుతుంది. మరి, పోటీని తట్టుకోవాలంటే సాలిడ్ బ్యాకప్ కావాలి. అందుకే, ఈ ప్రయత్నాలు.

ఈ సినిమాని నాని దక్షిణాదిలోని అన్ని భాషల్లో తన సినిమాని విడుదల చేస్తున్నారు. మిగతా భాషల్లో విజయం సంగతి తర్వాత ఇక్కడ భారీ ఓపెనింగ్ రావాలి. మొదటి మూడు రోజులు అదిరిపోవాలి.

 

More

Related Stories