నాని లైనప్ ఇదే!

Nani

హీరో నాని స్పీడ్ గా సినిమాలు పూర్తి చేసి విడుదల చేస్తాడు అని అందరికి తెలుసు. ఈ ఏడాది ఇప్పటికే ‘దసరా’ విడుదల చేశాడు. ఇప్పుడు డిసెంబర్ 7న “హాయ్ నాన్న” విడుదల కానుంది. ఈ ఏడాది కోటాలో ‘దసరా’, ‘హాయ్ నాన్న’ వచ్చాయి.

ఐతే, వచ్చే ఏడాది అంటే 2024లో మూడు విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట.

నాని ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు ఇవే. 1) సరిపోదా శనివారం 2) దసరా దర్శకుడితో మూవీ 3) హిట్ 3.

“సరిపోదా శనివారం” షూటింగ్ దశలో ఉంది. వివేక్ ఆత్రేయ దర్శకుడు. దానయ్య నిర్మాత. సమ్మర్ పోటీలో ఈ మూవీ ఉంటుంది. ‘దసరా’ దర్శకుడు చెప్పిన కొత్త సినిమా 2025లో విడుదలయ్యేలా వచ్చే ఏడాది చివర్లో మొదలుపెడుతాడట. 2024లో “హిట్ 3” విడుదల అవుతుంది. ఈ సినిమాలతో పాటు మరో మూవీ కూడా ఉంటుంది. ఐతే, దాని గురించి తర్వాత చెప్తాను అంటున్నారు నాని. అది సీక్రెట్ ప్రాజెక్ట్ అంట.

Advertisement
 

More

Related Stories