నాని సినిమా కూడా ఆగింది

Nani

ఒక్క నాని తప్ప గత నెలలోనే హీరోలందరూ సినిమాలు ఆపేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగులు రద్దు అయ్యాయి. ఐతే, నాని మాత్రం కంటిన్యూ చేశాడు. ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా కోసం ఒక ప్రైవేట్ ప్లేస్ లో సెట్ వేశారు. ఆ సెట్ లో షూటింగ్ చెయ్యకుండా సడెన్ గా ఆపితే నిర్మాతకు చాలా నష్టం వస్తుందని ఉద్దేశంతో నాని షూటింగ్ ని నిలిపివెయ్యలేదు. అలా మొండిగా షూటింగ్ చెయ్యడం వల్ల టీంలో చాలామంది కరోనా బారిన పడ్డారు.

‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా షూటింగ్ లో పని చేసినవారిలో పలువురు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇప్పుడు హడావుడిగా షూటింగ్ రద్దు చేశారు. కాకపోతే, ఎవరికీ సీరియస్ కాలేదంట. కరోనా వ్యాధికి గురైన వారందరికీ ట్రీట్ మెంట్ బాధ్యత నిర్మాత తీసుకున్నట్లు సమాచారం.

ఒక్క రజినీకాంత్ సినిమా తప్ప ఇప్పుడు హైదరాబాద్ లో ఏ సినిమా షూటింగ్ జరగడం లేదు.

Advertisement
 

More

Related Stories