నారా రోహిత్ అవేవి చేయట్లేదు

Nara Rohith

నారా రోహిత్ ఈ మధ్య గ్యాప్ తీసుకున్నాడు. మేకోవర్ అయ్యాడు. కెరీర్ లో ఈ మధ్య ప్లాప్లు చూశాడు. ఐతే, మంచి సినిమాలు చేసిన హీరోగా నారా రోహిత్ కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆది కాపాడుకోవాలనుకుంటున్నాడు. అందుకే… కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ హీరోగా ఒక కొత్త సినిమా వచ్చే నెలలో మొదలు పెట్టనున్నాడు.

ఇక రీసెంట్ గా అతని సినిమాల గురించి కొంత ప్రచారం జరిగింది. అందులో ఒకటి… అల్లు అర్జున్ హీరోగా నటించనున్న “పుష్ప” సినిమా. ఇందులో ఓ కీలక పాత్ర కోసం నారా రోహిత్ ని దర్శకుడు సుకుమార్ సంప్రదించిన మాట నిజమే. ఆగస్టులో షూటింగ్ చేద్దామని అనుకున్నారు సుకుమార్. అప్పుడు అటువైపు రోహిత్ మొగ్గు చూపాడు. ఐతే, సుకుమార్ సినిమా షూటింగ్ ఎప్పట్లాగే పోస్ట్ పోన్ అయింది. దాంతో రోహిత్ చాలా ఆలోచించుకొని “పుష్ప” చెయ్యకూడదు అని డిసైడ్ అయ్యాడు.

అలాగే నాని హీరోగా రాబోతున్న మరో సినిమాలో కూడా రోహిత్ ని అడిగారని ప్రచారం జరుగుతోంది. కానీ ప్రస్తుతానికి నారా రోహిత్ ఫోకస్ హీరోగా తన కెరీర్ని చక్కదిద్దుకోవడమే. ఈ కొత్త సినిమాని నెక్స్ట్ మంత్ అనౌన్స్ చేస్తాడు.

Related Stories