నా బెడ్రూమ్ లోకి దూరారా?

Naresh

గతంలో పలువురు సెలెబ్రిటీలపై ఇష్టమొచ్చిన ఆరోపణలు చేసిన నరేష్ ఇప్పుడు యూట్యూబర్స్, సోషల్ మీడియా జనత చేసే ట్రోలింగ్ ని తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా నటి పవిత్ర లోకేష్ తో ఆయన ప్రేమాయణం పబ్లిక్ అయిపోయాక ఆయన ఎక్కువ ట్రోలింగ్ ఎదుర్కుంటున్నారట.

కొందరు మరీ ముఖ్యంగా తన బెడ్రూమ్ లోకి దూరి చూసిన లెవల్లో ఇష్టమొచ్చినట్లు రాస్తున్నారు అని ఆయన మండిపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని గతంలో నరేష్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ సంగతి ఏమైంది అని మరోసారి పోలీసులను కలిశారు నరేష్.

తనను ట్రోలర్స్ మానసికంగా వేధిస్తున్నారు అని అంటున్నారు నరేష్.

పవిత్ర లొకేష్ ని పెళ్లాడబోతున్నట్లు నరేష్ ఈ ఏడాది జనవరి 1న సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఐతే, ఆ తర్వాత ఆయన మూడో భార్య రమ్య అడ్డం తిరిగారు. తనకి, నరేష్ విడాకులు జరగలేదని, లీగల్ గా తాను ఇంకా అతని భార్య అన్న విషయాన్ని ఆమె బయటపెట్టారు. దాంతో నరేష్ నాలుగో పెళ్లి ఆగిపోయింది.

 

More

Related Stories