‘రమ్య నన్ను చంపాలనుకుంటోంది’

Naresh

తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి తనకు ప్రాణ హాని ఉంది అని అంటున్నారు నటుడు నరేష్. ఆయన తాజాగా కోర్టుని ఆశ్రయించారు. ఆమె నుంచి తనకు విడాకులు ఇప్పించాలని, లేకపోతే ఆమె తనని చంపేస్తుంది అని కోర్టుకు తెలిపారు.

2010లో రమ్య రఘుపతి నరేష్ పెళ్లాడారు. నరేష్ కిది మూడో పెళ్లి. రమ్య, నరేష్ కి రణ్వీర్ అనే కొడుకు కూడా ఉన్నారు. ఐతే, కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

“నా ఆస్తి కాజేయడానికి రమ్య ప్రయత్నించింది. ఒప్పుకోకపోవడంతో నన్ను చంపేందుకు ప్రయత్నించింది. సుపరి గ్యాంగ్ ను మాట్లాడుకొంది. గతేడాది కొంతమంది నా ఇంట్లో చొరబడ్డారు. అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాను. నేను డబ్బులు ఇవ్వకపోవడంతో పలు రకాలుగా చంపాలని చూసింది,” అని నరేష్ తెలిపారు.

నరేష్ కొంతకాలంగా నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతామని ఒక వీడియో ద్వారా వెల్లడించారు. ఐతే, నాకు విడాకులు ఇవ్వకుండా ఆమెని ఎలా పెళ్లాడుతాడో చూస్తాను అని రమ్య రఘుపతి మీడియాకి తెలిపారు. ఇన్నాళ్లూ రమ్యకి విడాకులు ఇచ్చేశాను అని చెప్పుకుంటూ హడావిడి చేస్తున్న నరేష్ … ఇప్పుడు ఆమెకి, నాకు విడాకులు ఇప్పించండి అని కోర్టును ఆశ్రయించడం విశేషం.

Naresh and Ramya Raghuapati

రమ్య వల్ల నరకయాతన: నరేష్

“పెళ్లి అయిన కొన్ని నెలల నుండే నాకు ఆమె నుంచి వేదింపులు మొదలయ్యాయి. బెంగుళురులో ఉందామని పోరు పెట్టింది. నాకు తెలియకుండానే పలు బ్యాంకులు, వ్యక్తుల దగ్గర అప్పు చేసింది. అప్పులు తీర్చుకునేందుకు 10 లక్షలు ఇచ్చాను. నా కుటుంబ సభ్యుల నుండి మరో 50 లక్షలు తీసుకొంది. కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డి తో ఫోన్ చేయించి బెదిరించింది. చంపేస్తారనే భయంతోనే ఎక్కడికి ఒంటరిగా వెళ్ళటం లేదు. రమ్య వల్ల నరకయాతన అనుభవించాను. నాకు విడాకులు ఇప్పించండి,” అని నరేష్ కోర్టుకు విన్నవించుకున్నారు.

నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారంలో ఎన్నో మలుపులు

Naresh and Pavitra

నటి పవిత్ర లోకేష్ ని పెళ్లాడబోతున్నట్లు ప్రకటించిన నరేష్ కి లీగల్ సమస్యలు మొదలయ్యాయి. మూడో భార్య రమ్యకి విడాకులు ఇవ్వకుండానే పవిత్రని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఇరుక్కుపోయారు. అందుకే, ఇప్పుడు విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కారు.

Advertisement
 

More

Related Stories