
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు వచ్చే నెల జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మంచు విష్ణుకి మద్దతు తెలుపుతున్నట్లు కనిపిస్తోంది. పోటీలో ఉన్న ప్రకాష్ రాజ్ వర్గానికి ఆయన దూరంగా ఉండనున్నారు. ప్రకాష్ రాజ్ కి మెగాస్టార్ చిరంజీవి మద్దతిస్తున్న విషయం బహిరంగ రహస్యం. ఐతే, చిరంజీవి ఇప్పటివరకు ఎవరికి ఓపెన్ గా మద్దతు ప్రకటించలేదు.
కానీ నరేష్, నందమూరి బాలకృష్ణ వంటి నటులు మంచు విష్ణు వైపు ఉన్నట్లు కనిపిస్తోంది. అలాంటి స్టేట్ మెంట్స్ ఇచ్చారు. దాంతో వీరిలో కులాల చీలిక వచ్చిందా అన్న అనుమానాలు కనిపిస్తున్నాయి.
కానీ “మా”లో కులాల పేరుతో రాజకీయాలకు చోటు లేదని నరేష్ అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరిదీ ఒకే కులం, ఒకే మతం అదే సినిమా కులం అని నరేష్ ఒక డైలాగ్ వదిలారు.
సినిమా నటుల్లో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఉన్నారు. ఎవరూ కులం గురించి ఆలోచించరు, అలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని నరేష్ విజ్ఞప్తి చేశారు. ఎవరికీ మద్దతు పలకాలి అనేది వారి వ్యక్తిగత స్నేహాలు, ఆలోచనలు ప్రకారమే జరుగుతాయి అని స్పష్టం చేశారు.