నాలుగో పెళ్లి చేసుకోవట్లేదు: నరేష్

VK Naresh


హీరో నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మూడో భార్యకి ఇటీవలే విడాకుల నోటీసు పంపానని తానే చెప్తున్నాడు. మూడు పెళ్లిళ్లుతోనే ఆగిపోవడం లేదు నాలుగో పెళ్ళికి సిద్ధమవుతున్నాడు అని జోరుగా ప్రచారం జరుగుతోంది.

సాధారణంగా హాలీవుడ్ హీరోలు 70 ఏళ్ల వయసులో కూడా ఆరో, ఏడో పెళ్లి చేసుకుంటారు. మన టాలీవుడ్ నరేష్ కూడా హాలీవుడ్ గా మారిపోయాడా అని చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. 62 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి అవసరమా అంటూ ఫిలింనగర్ లోనే కామెంట్స్ పడుతున్నాయి. దాంతో, ఆయన స్పందించాడు.

“నేను నాలుగో పెళ్లి చేసుకోవడం లేదు. నటి పవిత్రని పెళ్ళాడలేదు, బోవడం లేదు. అది పుకారు మాత్రమే. నా మూడో భార్య రమ్య ఒక మోసగత్తె. ఆమెకి విడాకుల నోటీసు పంపిన మాట నిజమే,” అని నరేష్ మీడియాకి తెలిపారు.

నరేష్ ‘రసికత్వం’ గురించి కూడా సోషల్ మీడియాలో మీమ్స్ బాగా పడుతున్నాయి. మొత్తమ్మీద నరేష్ 60 ప్లస్ లో పెళ్లి పుకార్లతో హెడ్ లైన్స్ లోకి వచ్చాడు. వయసులో ఉన్నప్పుడు ఆయన ‘అఫైర్ల’ గురించి, పెళ్లిళ్ల గురించి పుకార్లు చూడలేదు. ఇప్పుడు వాటి గురించి వివరణ ఇచ్చుకోవాల్సి రావడం విశేషం.

 

More

Related Stories