ఇకపై ఇలాంటి సినిమాలే చేస్తా: నరేష్

Allari Naresh

ఎనిమిదేళ్ల తర్వాత హిట్ వచ్చింది అల్లరి నరేష్ కి. విచిత్రం ఏమిటంటే నరేష్ కి మళ్ళీ బ్రేక్ తెచ్చింది కామెడీ సినిమా కాదు. ఒక సీరియస్ మూవీ అతన్ని సక్సెస్ బాటలో నిలిపింది. ‘నాంది’ సినిమా శుక్రవారం విడుదలైంది. సినిమాని విమర్శకులు మెచ్చుకున్నారు. నరేష్ నటనకి ఎక్కువ మార్కులేశారు. ఫస్ట్ రోజు డల్ కలెక్షన్లే. కానీ మౌత్ టాక్, రివ్యూస్ తో శనివారం నుంచి కలెక్షన్లు పెంచుకుంది. ఇప్పుడు మంచి హిట్ దిశగా సాగుతోంది.

“2012 తర్వాత హిట్స్ పలకరించడం మానేశాయి. హిట్ అవుతుందని అనుకున్న ప్రతి సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు కష్టం ఫలించింది. మహర్షి తర్వాత కంగారు పడి సినిమా చేయకూడదు, కంటెంట్ తో చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. దర్శకుడు విజయ్ కు, రైటర్ లకు థ్యాంక్స్ చెబుతున్నాను. విజయ్ గారికి చాలా చెక్స్ వచ్చి ఉంటాయి అడ్వాన్స్ లుగా. సతీష్ నిర్మాతగా ధైర్యం చేశారు. కామెడీ ఇమేజ్ ఉన్న హీరోతో ప్రయోగాత్మక సినిమా ఏంటి అనుకోకుండా కొత్త తరహా సినిమా ప్రయత్నించారు. ఇకపైనా ఇలాంటి డిఫరెంట్ సినిమాలే చేయాలని కోరుతున్నా. నేను కూడా ఈ విజయాన్ని కొనసాగించేలా సినిమాలు ఎంచుకుంటాను,” అని నరేష్ చెప్పాడు.

ఇకపై సినిమాల ఎంచుకునే విషయంలో పొరపాట్లు చేయనంటున్నాడు.

More

Related Stories