ఏడాదికి రెండు గ్యారెంటీ

Malli Pelli


కొంతకాలంగా నరేష్, పవిత్ర లోకేష్ కలిసి జీవిస్తున్నారు. అతనికి ఇది నాలుగో కాపురం. ఆమెకి రెండో సంసారం. పెళ్లి చేసుకున్నారా లేదా అన్నది పక్కన పెడితే వారిద్దరూ భార్యాభర్తలు మాదిరిగానే ప్రస్తుతం సహజీవనం సాగిస్తున్నారు. మూడో భార్య నుంచి ఇంకా విడాకులు రాలేదు కాబట్టి ప్రస్తుతానికి తమకు పెళ్లి అయినట్లు చెప్పుకోవడం లేదు ఇద్దరూ.

ఇక వీరి బంధానికి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అంగీకరించారట. మహేష్ బాబు నరేష్ కి సోదరుడి వరుస అవుతాడు. నరేష్ పెళ్ళికి, ఆయన రిలేషన్ లకు మహేష్ బాబు ఆమోదం అవసరం లేదు. కానీ, పవిత్రని ‘తమ కుటుంబంలోకి’ నరేష్ తీసుకొచ్చాడు కాబట్టి మహేష్ బాబు ఆమోదం కూడా తీసుకున్నాడట.

మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత నరేష్ ‘పవిత్ర’బంధానికి ఆనందంగా మద్దతు తెలిపారట.

నిర్మాతగా ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా నిర్మించారు నరేష్. ఈ సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించారు. ఇకపై నిర్మాతగా తాను ఏడాదికి రెండు సినిమాలు తీస్తాను అని అంటున్నారు నరేష్.

 

More

Related Stories