శ్రీకాంత్ అలా మాట్లాడవేంటమ్మా!

53 ఏళ్ల హీరో శ్రీకాంత్ ని చిన్న పిల్లాడిలా సంభోదిస్తున్నారు 62 ఏళ్ల నరేష్. “ఏంటమ్మా … అలా చేసావేంటమ్మా… ” అంటూ మాట్లాడుతున్నారు వీకే నరేష్. గతంలో నా ప్యానెల్ కి వ్యతిరేకంగా పోటీచేసి ఓడిపోయావు అంటూ దెప్పి పొడుస్తున్నారు నరేష్.

గత శుక్రవారం రాత్రి హీరో సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ కి గురి కాగానే నరేష్ ఒక వీడియో విడుదల చేశారు. అందులో నరేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన మాటలను పలువురు తప్పుబట్టారు. బండ్ల గణేష్ తో పాటు శ్రీకాంత్ కూడా నరేష్ మాటలు తప్పు అని వ్యాఖ్యానించారు. ఐతే, బండ్లని వదిలి శ్రీకాంత్ కి కౌంటర్ ఇచ్చారు నరేష్.

బండ్ల గణేష్ ని కార్నర్ చెయ్యలేదు. ఎందుకంటే ఈ మాటలు, వీడియోలు, కౌంటర్లు, రిటార్టులు అన్ని త్వరలో జరగోబోయే మా ఎన్నికల కోసమే. శ్రీకాంత్ వ్యతిరేక వర్గానికి నరేష్ మద్దతిస్తున్నారు.

“ఏమ్మా శ్రీకాంత్.. నీ బైట్ చూశాను. అలా ఇచ్చావేంటమ్మా… మంచి సినిమాలు చేశావు. నా కళ్ల ముందు నువ్వు హీరో అయ్యావు. మా ఎలక్షన్స్‏లో నా అపోజిట్ ప్యానెల్ లో పోటీ చేసి ఓడిపోయావు. బైట్స్ ఇచ్చే ముందు ఆలోచించి, ఒకసారి పెద్దవారితో చర్చించి మాట్లాడు. 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. సినిమా ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను,” ఇలా సంబంధం లేకుండా నరేష్ కౌంటర్ ఇచ్చారు.

“సాయితేజ బురదలో జారి పడ్డాడు. అది యాక్సిడెంట్. కానీ మీడియాలో నేను చెప్పింది తప్పుగా వచ్చింది అని మనవాళ్ళు చెప్పితే మళ్ళీ వివరణ ఇచ్చాను,” అంటూ చెప్పుకొచ్చారు నరేష్.

 

More

Related Stories