నరుడు… టిల్లు ఎందుకయ్యాడు?

- Advertisement -
DJ Tillu


సిద్దూ జొన్నలగడ్డ హీరోగా సితార సంస్థ “నరుడు బతుకు నటన” అనే సినిమా ప్రకటించింది. షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్ ని ఇప్పుడు మార్చారు. “నరుడు బతుకు నటన” నుంచి “DJ టిల్లు”గా మారింది. ఇంతకీ, నరుడు టిల్లుగా ఎందుకు మారాడు?

ఆ టైటిల్ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారా? లేదా యూత్ ఫుల్ సినిమాకి మరీ “సాగరసంగమం” కాలంనాటి టైటిల్ ఎందుకని మార్చారా? అన్న డౌట్స్ వస్తున్నాయి. దర్శక, నిర్మాతలు ఈ విషయంలో క్లారిటీ లేదు. కానీ రెండోది కారణం కావొచ్చు అనిపిస్తోంది.

సిద్దూ జొన్నలగడ్డ ఇప్పటికే “గుంటూరు టాకీస్”, “కృష్ణ అండ్ హిజ్ లీల” వంటి సినిమాలతో పాపులర్ అయ్యాడు. అతను యూత్ కి కనెక్ట్ అయ్యాడని అంటున్నారు. అందుకే యంగ్ తరంగ్ లకు నచ్చేలా “టిల్లు” ముస్తాబు అవుతున్నాడట.

ఈ సినిమాలో హీరోయిన్ గా నేహా శెట్టి నటిస్తోంది. ఈ భామ ఇప్పటికే “మెహబూబా”, “గల్లీ రౌడీ” వంటి చిత్రాల్లో నటించింది. ఆమెకి ఇది తెలుగులో మూడో సినిమా కానుంది.

 

More

Related Stories