చిరంజీవి సాయం వద్దనుకున్నాను

చిరంజీవి-నాజర్ కలిసి పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. చెన్నైలో ఉండేటప్పుడు ఇద్దరూ ఒకే దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారట. చిరంజీవితో తనకున్న అనుబంధం, తమ మధ్య స్నేహాన్ని నాజర్ బయటపెట్టారు.

చిరంజీవి దగ్గర చాలా టాలెంట్ ఉందంటున్నారు నాజర్. ట్రయినింగ్ పూర్తయిన వెంటనే చిరంజీవికి వరుసపెట్టి అవకాశాలు వచ్చాయంట. కెరీర్ లో చాలా ఫాస్ట్ గా ఎదిగారట చిరంజీవి. అదే టైమ్ లో నాజర్ కు మాత్రం అవకాశాలు రాలేదు. దీంతో ఆయన ఇండస్ట్రీని వదిలి ఓ హోటల్ లో చిన్న ఉద్యోగంలో చేరిపోయారట.

ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, నాజర్ తో మాట్లాడరట. ఓసారి వచ్చి కలవమని కోరారట. కానీ నాజర్ మాత్రం వెళ్లి కలవలేదంట. తనకు సెల్ఫ్-రెస్పెక్ట్ ఎక్కువనే విషయం చిరంజీవికి తెలుసని, పైగా ఆ టైమ్ లో తను ఇండస్ట్రీని రెండో ఆప్షన్ గా మాత్రమే చూశానని, హోటల్ లో నెల జీతం తనకు చాలా అత్యవసరమని నాజర్ తెలిపారు. ఆ తర్వాత బాలచందర్ గారి చలవతో నాజర్ కూడా ఇండస్ట్రీలో క్లిక్ అయ్యారు. పూర్తిగా పరిశ్రమలో సెటిల్ అయిపోయారు.

ఖైదీ నంబర్ 150 షూట్ లో చిరంజీవి-నాజర్ కలుసుకున్నారు. అప్పుడు నాజర్ గురించి చిరంజీవి మాట్లాడారట. ఆ టైమ్ లో నాజర్ వస్తారని, చిరంజీవి చాలా రోజులు వెయిట్ చేశారట. అలాంటి మంచి మనసు చిరంజీవికి ఉందన్నారు నాజర్. ఇప్పటికీ చిరంజీవికి, నాకు మధ్య మంచి రిలేషన్ షిప్ ఉందని, మేం ఒకరికొకరం సాయం చేసుకోమని, ఎందుకంటే ఇద్దరికీ సెల్ఫ్-రెస్పెక్ట్ ఎక్కువని అన్నారు నాజర్.

Advertisement
 

More

Related Stories