- Advertisement -

కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటించిన చిత్రం… నాట్యం. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ మూవీ పేరుకు తగ్గట్లే నాట్యం చుట్టూ తిరిగే కథ. గత నెలలో థియేటర్లలో విడుదల అయింది. తాజాగా ఈ సినిమాకి ఒక గౌరవం దక్కింది. ఈ నెల 20 న గోవాలో ప్రారంభం కానున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫి)లో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది.
ఈ సారి ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శితం కానున్న ఒకే ఒక్క తెలుగు సినిమాగా నాట్యం నిలవడం గర్వంగా ఉంది అన్నారు దర్శకుడు రేవంత్ కోరుకొండ.
కుటుంబ వ్యాపారాలు, డ్యాన్స్‌ను వదిలిపెట్టి సినిమాలు చెయ్యడం అవసరమా అన్నారు. ఇఫికి ఈ సినిమా ఎంపికకావడమే వారికి సమాధానంగా భావిస్తున్నా. తెలుగు నాట్యకళలకు మరింతగా ఈ సినిమా గుర్తింపును తీసుకొస్తుందని నమ్ముతున్నా అని చెప్పారు హీరోయిన్ సంధ్యారాజ్.