నవదీప్ లవ్ ట్రాక్ బయటపెట్టిన శ్రీముఖి

ఇండస్ట్రీలో నవదీప్ మంచి రసిక రాజా అనే విషయం అందరికీ తెలిసిందే. అంతెందుకు “అల వైకుంఠపురములో” సినిమాలో ఓ సీన్ లో ఏకంగా బన్నీ నవదీప్ ను ఏ-సర్టిఫికేట్ అనేశాడంటే నవదీప్ ఏ రేంజ్ పులిహోర రాజా అనే విషయం అర్థమౌతుంది. ఇప్పుడు నవదీప్ కొత్త లవ్ ట్రాక్ బయటపడింది. ఆ మేటర్ ను బయటపెట్టింది కూడా ఎవరో కాదు, శ్రీముఖి.

ఓ కార్యక్రమంలో శ్రీముఖి, యాంకర్ విష్ణుప్రియ పాల్గొన్నారు. యాంకరింగ్ చేసే అవకాశం వస్తే రానాతో చేస్తావా నవదీప్ తో చేస్తావా అనే ప్రశ్న విష్ణుప్రియకు ఎదురైంది. వెంటనే విష్ణుప్రియ, నవదీప్ పేరుచెప్పింది. అక్కడితో ఆగకుండా ఐ లవ్ యు నవదీప్ అంటూ గట్టిగా అరిచేసింది.

Also Check: Vishnupriya Photos

విష్ణు ప్రియ ఇంత హడావుడి చేస్తుంటే శ్రీముఖి ఊరుకుంటుందా..? అసలు మేటర్ చెప్పేసింది. నవదీప్-విష్ణుప్రియ ఈమధ్య బాగా క్లోజ్ అయ్యారని, రాత్రిళ్లు డిన్నర్లు కూడా చేస్తున్నారంటూ ఇంకా ఏదో చెప్పబోతోంటే విష్ణుప్రియ మధ్యలోనే కట్ చేసింది.

అలా నవదీప్-విష్ణుప్రియ లవ్ ట్రాక్ ను శ్రీముఖి బయటపెట్టేసింది. మొత్తానికి నవదీప్ ఖాళీగా మాత్రం ఉండడనే విషయం మరోసారి ప్రూవ్ అయింది.

Related Stories