ముందస్తు బెయిల్ కోరిన నవదీప్

- Advertisement -
Navdeep

డ్రగ్స్ కేసులో నేను లేను అని గురువారం మీడియాకి చెప్పిన నవదీప్ కి తర్వాత అసలు విషయం అర్థమైంది. ఆయన అరెస్ట్ కి పోలీసులు సిద్ధమయ్యారు అని తెలిసిపోయింది. “వేరే ఎవరినో నన్ను అనుకుంటున్నారు” అని నవదీప్ సడెన్ గా కోర్టును ఆశ్రయించారు.

ముందస్తు బెయిల్ కావాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు నవదీప్.

పిటిషన్ ని విచారణకు స్వీకరించిన కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు అరెస్ట్ చెయ్యొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. సో, అప్పటివరకు నవదీప్ కి ఊరట.

డ్రగ్స్ కేసు (Drug bust in Hyderabad)లో నవదీప్ ఉన్నారు టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ గురువారం వెల్లడించారు. అతను రెగ్యులర్ గా డ్రగ్స్ తీసుకుంటారు, కొంటారు అని తమ విచారణలో తేలింది అని పోలీసులు చెప్తున్నారు.

 

More

Related Stories