నవ్వురాని పోలిశెట్టి వీడియో!

- Advertisement -

నవీన్ పోలిశెట్టి నటించిన ‘జాతిరత్నాలు’ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాతో నవీన్ పోలిశెట్టి రేంజ్ మారిపోయింది. హీరోగా అతని గ్రాఫ్ పెరిగింది. టాలెంట్ విషయంలో నవీన్ అదుర్స్. కానీ, జాతిరత్నాలు విడుదలై 20 నెలలు పూర్తి అయినా మరో సినిమా రిలీజ్ చెయ్యలేదు.

‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ మరో సినిమా (ప్రిన్స్) విడుదల చేశాడు కానీ నవీన్ పోలిశెట్టి ఇంకో సినిమా రిలీజ్ చెయ్యలేకపోయాడు. దాంతో, అభిమానులు తన సినిమాల అప్డేట్ అడుగుతున్నారు అని ఒక కామెడీ స్కిట్ చేసి దాన్ని వదిలాడు. ఆ వీడియో ఫన్నీగా ఉంటుంది అని ఊహించుకుంటే మరో విధంగా ఉంది.

వీడియోలో ఆర్టిఫీషియలిటీ ఉంది కానీ నవ్వు వచ్చేఎలిమెంట్ లేదు.

నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం అనుష్క సరసన ఒక మూవీ చేస్తున్నాడు. అలాగే ‘అనగనగా ఒక రాజు’ అనే మరో మూవీలో నటిస్తున్నాడు. ఈ రెండూ 2023లో వచ్చే అవకాశం ఉంది. ఆ సినిమాల గురించి కూడా మాట్లాడకుండా వాచ్ మెన్, రెస్టారెంట్ ఓనర్, పార్క్ లో కుర్రాడు, విదేశీ తెల్లవాడు ఇతన్ని పిలిచి అప్డేట్ అడుగుతున్నట్లు ఎదో ఎదో స్కిట్ చేశాడు.

NAVEEN POLISHETTY | MOVIE UPDATES ENTI ? | HILARIOUS NEW YEAR VIDEO
 

More

Related Stories