
ప్రముఖ సినీనటి నవనీత్ కౌర్ ఇప్పుడు రాజకీయ నాయకురాలు. 2109లో మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు. ఐతే, ఆమె ఎంపీ పదవి ఇప్పుడు డౌట్ లో పడింది. దానికి కారణం ఆమె తన కులం విషయంలో ఫేక్ సర్టిఫికేట్ సమర్పించిందట.
నవనీత్ కౌర్ నకిలీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించినట్లు బాంబే హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ఆమె ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది. అంతేకాదు రూ.2 లక్షల పరిహారం కూడా విధించింది.
నవనీత్ కౌర్ ఇండిపెండెంట్ ఎంపీ. కానీ బీజేపీకి మద్దతుదారుగా ఉన్నారు. అందుకే, ఆమె తప్పుడు ధ్రువ పత్రం సమర్పించింది అని శివసేన నాయకుడు కోర్టులో కేసు వేశారు. ఆయన వాదన నిజమని బాంబే హైకోర్టు తేల్చింది. లోక్ సభలో బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతుంటుంది. మరి ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన నవనీత్ కౌర్ అమరావతికి చెందిన రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకొంది.