నవనీత్ కు కరోనా ఇలా వచ్చింది

naveen kaur

ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం ఎంపీ నవనీత్ కౌర్ కూడా కరోనా బారిన పడింది. హోం క్వారంటైన్ లో ఉన్న ఈ పొలిటీషియన్, తనకు ఎలా కరోనా సోకిందనే విషయాన్ని బయటపెట్టింది.

ముందుగా నవనీత్ కౌర్ కూతురు, కొడుక్కి కరోనా వచ్చిందట. వాళ్ల ద్వారా ఇతర కుటుంబ సభ్యులకు కూడా సోకిందట. ఓ తల్లిగా పిల్లల ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, అలా వాళ్ల బాగోగులు చూసుకుంటున్న క్రమంలో తనకు కూడా కరోనా సోకిందనే విషయాన్ని బయటపెట్టింది నవనీత్ కౌర్.

ఈమధ్య కాలంలో తనతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా విధిగా పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్ లో ఉండాలని కోరుతున్నారు ఈ ఎంపీ. అందరి ఆశీర్వాదంతో తామంతా త్వరలోనే కరోనా నుంచి బయటపడతామంటున్నారు.

మహారాష్ట్రలోని అమరావతి సెగ్మెంట్ నుంచి ఎంపీగా గెలిచారు నవనీత్ కౌర్. తెలుగులో “శీను వాసంతి లక్ష్మి”, “జగపతి”, “రూమ్ మేట్స్”, “మహారథి”, “యమదొంగ” లాంటి సినిమాల్లో నటించారు.

Related Stories