- Advertisement -

పలు తెలుగు సినిమాల్లో నటించిన నవనీత్ కౌర్ ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నవనీత్ కౌర్ ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నవనీత్ తెలుగు వారి వల్లే తనకు పేరు వచ్చిందని చెప్పారు.
ఇటీవల ఆమె ఎన్నిక చెల్లదంటూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించి ఎన్నికలలో గెలిచిందని ఆరోపణలు వచ్చాయి. ఐతే, ఈ కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దాంతో, ఆమె తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. కుదిరితే తెలుగువారికి కూడా సేవ చేయాలని ఉందని అంటున్నారు నవనీత్ కౌర్.
ప్రస్తుతం బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్న నవనీత్ కౌర్ కి భవిష్యత్ లో ఏదైనా కేంద్ర పదవి దక్కుతుందా అనేది చూడాలి.