- Advertisement -

మాధవన్ అందగాడు. 50 దాటినా కూడా ఆయన అందం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు కూడా హీరోగా మంచి సినిమాలు చేస్తున్నాడు మాధవన్.
లేటెస్ట్ గా ఆయన నయనతారతో జతకట్టాడు. తమిళనాట లేడి సూపర్ స్టార్ అనిపించుకున్న నయనతార ఒక కొత్త సినిమా ఒప్పుకొంది. ఈ సినిమాలో ఆమె సరసన మాధవన్ నటిస్తున్నారు. ‘టెస్ట్’ అనే ఈ మూవీ క్రికెట్ ఆట చుట్టూ తిరిగే స్పోర్ట్స్ డ్రామా. సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు.
వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’ వంటి సినిమాలు తీసిన నిర్మాత శశికాంత్ దర్శకుడిగా మారి తీస్తున్న మొదటి చిత్రం.
మాధవన్ ఇంతకుముందు అనుష్క సరసన ‘నిశ్శబ్దం’ సినిమాలో నటించారు. బాలీవుడ్ లో కంగనా వంటి హీరోయిన్ల చిత్రంలో కూడా జోడిగా కనిపించారు. అలా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో హీరోయిన్ కి జోడిగా నటిస్తున్నారు.