
నయనతారకి ఇద్దరు కవల పిల్లలు. నయనతారకి గతేడాది సరోగసీ ద్వారా ఉయిర్, ఉలగమ్ జన్మించారు. నయనతార పుట్టింది, పెరిగింది కేరళలోనే. అందుకే, ఆమె కేరళీయులు అందరూ ఘనంగా జరుగుపుకునే ఓనం పండుగని ఈ సారి తన పిల్లలతో కలిసి సెలెబ్రేట్ చేసుకొంది.
ఆమె భర్త విగ్నేష్ శివన్ ఆమె కొత్త ఫోటోలను షేర్ చేశారు. తన పిల్లలతో ఓనం పండుగని జరుపుకుంటున్న ఫొటోలవి.
నయనతార నటించిన మొదటి హిందీ చిత్రం “జవాన్” విడుదలకు సిద్ధం అవుతోంది. సాధారణంగా ఆమె ఏ సినిమా ప్రమోషన్ లలో పాల్గొనదు. కానీ షారుక్ మూవీ కాబట్టి ఆమె తన రూల్ ని బ్రేక్ చేసి ఈ సారి “జవాన్” ఈవెంట్ కి హాజరు కానుంది అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆ ఈవెంట్ గురించి ఎలాంటి సమాచారం లేదు. సో, నయనతార ఈ సినిమా ప్రొమోషన్ కోసం బయటికి వస్తుందా లేదా అన్నది చూడాలి.
తమిళంలో ఆమె కొత్తగా సినిమాలు ఇంకా సైన్ చెయ్యలేదు.