
నయనతార తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక తమిళనాట లేడీ సూపర్ స్టార్ అని ఇమేజ్ తెచ్చుకొంది. సింగిల్ హ్యాండ్ తో సినిమాలకు ఓపెనింగ్ తీసుకొస్తుంది నయనతార. ఐతే, ఆమె ఎంత పెద్ద హీరో సరసన నటించినా ఆ సినిమా ప్రమోషన్స్ కి రాలేదు. ఈవెంట్స్ కి అటెండ్ అవదు.
అలాంటి నయనతార రీసెంట్ గా ‘కనెక్ట్’ అనే తన కొత్త చిత్రం కోసం సుమ కనకాలతో ఇంటర్వ్యూ చేసింది. ఈ సినిమాని నిర్మించింది కూడా ఆమె భర్త విగ్నేష్. దాంతో, సొంత సినిమాకోసం ప్రమోషన్ చేస్తున్నప్పుడు ఇతర నిర్మాతల చిత్రాలకు మాత్రం చెయ్యడానికి ఏంటి సమస్య అనే ప్రశ్న మొదలైంది.
ALSO READ: Connect Review: Narrative style makes the difference
ఆమెది డబుల్ స్టాండర్డ్ అనే విమర్శలు కూడా మొదలయ్యాయి.
దాంతో, ఆమె ఈ విషయంలో వివరణ ఇచ్చింది. “నేను మొదట్లో ప్రమోషన్స్ కి వచ్చాను. కానీ, హీరోయిన్లకు ఆడియో ఫంక్షన్ లలో విలువ ఇవ్వడం లేదని గ్రహించా. మొత్తం హీరో చుట్టే ఈవెంట్స్ జరుగుతాయి. హీరోయిన్లని ఎక్కడో మూలకు నెట్టేస్తారు. సినిమా ఇంటర్వ్యూలలో కూడా సినిమా గురించి కాకుండా ఆ హీరో గురించే మాట్లాడాలి. హీరోయిన్లకు కొంచెమైనా గౌరవం దక్కాలంటే ఇలాగే ఉండాలి అని నిర్ణయించుకున్నా,” అని క్లారిటీ ఇచ్చింది.