పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయిన నయనతార

మరికొన్ని రోజుల్లో పెళ్లితో ఒకటి కాబోతున్నారు నయనతార-విఘ్నేష్ శివన్. దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట, వచ్చే నెలలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. తమ పెళ్లి ఏర్పాట్లను నయనతార దగ్గరుండి చూసుకుంటోంది. నయనతార కుటుంబం ఈ పెళ్లిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది.

నయన్-విఘ్నేష్ పెళ్లి తిరుమలలో జరగనుంది. ఇది సింపుల్ గానే జరగబోతోంది. పెళ్లి తర్వాత నూతన దంపతులిద్దరూ స్వామివారిని దర్శించుకోవడంతో ఈ పెళ్లి వేడుక ముగుస్తుంది. ఆ తర్వాత అసలు తంతు ఉంటుంది. ఇండస్ట్రీ కోసం గ్రాండ్ రిసెప్షన్ పార్టీ ఏర్పాటుచేసింది ఈ జంట.

ఈ రిసెప్షన్ ఏర్పాట్లనే నయనతార దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్, కోలీవుడ్ నుంచి చాలామంది ప్రముఖులు హాజరుకాబోతున్నారు. తమిళనాడు నుంచి కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకాబోతున్నారు. వీళ్లందరి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

పెళ్లికి ముందే దేశంలోని వివిధ దేవాలయాల్ని సందర్శించింది నయన్-విఘ్నేష్ జంట. కొన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఇప్పుడు పెళ్లితో ఒకటి కాబోతున్నారు.

రీసెంట్ గా విఘ్నేష్ దర్శకత్వంలో ఓ సినిమా రిలీజ్ చేసింది నయనతార. చేతిలో గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు ఉన్నప్పటికీ.. వాటికి కొన్నాళ్లు బ్రేక్ ఇవ్వబోతోంది.

 

More

Related Stories