విఘ్నేష్ ను పెళ్లాడిన నయన్

ఆరేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నయన్-విఘ్నేష్ వివాహం ఈరోజు పూర్తయింది. చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో ఉన్న ఓ రిసార్ట్ హోటల్ లో నయన్-విఘ్నేష్ పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా ఉదయం 10 గంటల 30 నిమిషాలకు నయనతార మెడలో తాళి కట్టాడు విఘ్నేష్. ఆ వెంటనే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. తాళి కట్టిన తర్వాత ప్రేమతో భార్యను ముద్దాడిన ఫొటోను షేర్ చేశాడు.

దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు నయనతార-విఘ్నేష్. ఓ సినిమా షూటింగ్ లో కలిసి వీళ్లిద్దరూ ఆ సినిమా సెట్స్ లోనే దగ్గరయ్యారు. ఆ తర్వాత పుట్టినరోజులకు విదేశాలకు వెళ్లడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇంట్లోనే ఓనమ్ లాంటి పండగలు చేసుకోవడం స్టార్ట్ చేశారు. అలా తమ ప్రేమను ఫొటోల రూపంలో బయట ప్రపంచానికి కూడా తెలియజేశారు.

గతేడాది నయ్-విఘ్నేష్ రింగులు మార్చుకున్నారు. తమకు ఎంగేజ్ మెంట్ అయిన విషయాన్ని నయనతార ఆమధ్య కన్ ఫర్మ్ చేసింది. ఇప్పుడు పెళ్లితో ఒక్కటైంది ఈ జంట. వీళ్లకు పెళ్లికి రజనీకాంత్, షారూక్ ఖాన్, అట్లీ, సూర్య, కార్తీ లాంటి ప్రముఖులు హాజరయ్యారు.

పెళ్లి తర్వాత కూడా సినిమాలు కొనసాగించబోతోంది నయనతార. తమిళ్ లో ఆమె 2 సినిమాలకు సైన్ చేసింది. అటు బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. 

 

More

Related Stories