
కొత్త పెళ్లి కూతురు పసుపుతాడుని ఒక వారమో, రెండు వారాలో ఉంచుకుంటుంది. ఆ తర్వాత బంగారం తాళి/మంగళసూత్రం మాత్రమే మెళ్లో ధరిస్తారు. నయనతార పెళ్లి జరిగి నెల కావొస్తోంది. కానీ, ఆమె ఇప్పటికీ తన భర్త విగ్నేష్ శివన్ పెళ్లి పీటలపై కట్టిన పసుపుతాడుని ధరిస్తూనే ఉంది. బంగారపు తాళి కాదు సాధారణ పసుపు తాడునే గర్వంగా మెళ్ళో ఉంచుకొంది.
ఆమె ఇప్పుడు షూటింగ్ లలో పాల్గొంటోంది. షారుక్ సరసన ఒక హిందీ సినిమా చేస్తోంది నయనతార. ఆమెకిదే మొదటి హిందీ చిత్రం. ఈ షూటింగ్ ముంబైలో సాగుతోంది. ఈ షూటింగ్ లొకేషన్ కి నయనతార వెళ్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్ లు తీస్తున్న ఫోటోలు చూస్తుంటే ఆమె మెళ్ళో పసుపుతాడు స్పష్టంగా కనిపిస్తోంది.
పసుపుతాడుని ఆమె ఫ్యాషన్ గా మార్చేసింది అని పాజిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

మరోవైపు, నయనతార సినిమాలను మానెయ్యనని స్పష్టం చేసింది. షారుక్ సినిమానే కాదు తమిళంలో మరి కొన్ని సినిమాలు సైన్ చేస్తుందట. తెలుగులో ఆమె నటించిన ‘గాడ్ ఫాదర్’ ఈ దసరాకి విడుదల కానుంది.