నయనతారకు గుడిలో పెళ్లి?

నయనతారకు గుడిలో పెళ్లి?

దాదాపు నాలుగేళ్లుగా విఘ్నేష్ శివన్ తో డేటింగ్ చేస్తోంది నయనతార. ఏ క్షణానైనా ఈ జంట పెళ్లి చేసుకుంటుందంటూ గడిచిన 6-7 నెలలుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆ పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా అటు విఘ్నేష్, ఇటు నయన్ వాటిని ఖండించకపోవడంతో మరిన్ని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇందులో భాగంగా నయన్-విఘ్నేష్ సింపుల్ గా ఓ గుడిలో పెళ్లి చేసుకుంటారనే టాక్ బయటకొచ్చింది.

లాక్ డౌన్ ఉన్నా, లాక్ డౌన్ లేకున్నా నయన్-విఘ్నేష్ సింపుల్ గానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని విఘ్నేష్ గతంలోనే వెల్లడించాడు. అలాంటి ఈ జంటకు ఈ లాక్ డౌన్ అనుకోని విధంగా కలిసొచ్చింది. దీంతో ఓ గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని వీళ్లిద్దరూ అనుకుంటున్నారట.

ఈ లాక్ డౌన్ టైమ్ లోనే పెళ్లి చేసుకోవడానికి మరో రీజన్ కూడా ఉంది. సినిమా షూటింగ్స్ లేవు కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కాల్షీట్ల సమస్య ఉండదు. పనిలోపనిగా వెంటనే కాపురం కూడా పెట్టేయొచ్చు. ఇలా అన్నీ కలిసొస్తున్నాయి కాబట్టే వీలైనంత తొందరగా విఘ్నేష్ చేతులతో మూడు ముళ్లు వేయించుకోవాలని నయన్ ఆరాటపడుతోందట.

 

More

Related Stories