
నయనతార, విగ్నేష్ శివన్ కి ఇటీవలే ఎంగేజ్ మెంట్ జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది. ఐతే, అంతకన్నాముందు వీరిద్దరూ కలిసి నిర్మిస్తున్న ఒక మూవీ విడుదల కావాలి. ‘కాధు వాకుల రెండు కాదల్’ (Kaathu Vaakula Rendu Kadhal) అనే సినిమా నిర్మాణంలో చాలా పెట్టుబడి పెట్టారు. విజయ్ సేతుపతి, నయనతార, సమంత నటిస్తున్నారు ఇందులో. విగ్నేష్ శివం దర్శకుడు. కరోనా కారణంగా సినిమా నిర్మాణం ఆలస్యం అయింది. పెట్టిన డబ్బులు లాక్ అయ్యాయి. అందుకే, కొంత టెన్షన్ గా ఉంది ఈ జంట.
ఐతే, మొత్తమ్మీద ఈ సినిమా షూటింగ్ సక్సెస్ ఫుల్ గా పూర్తి అయింది ఇప్పుడు దాంతో, ఈ రోజు (సెప్టెంబర్ 27) తిరుపతికి వచ్చి శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. గుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత మీడియాకి కూడా ఫోజులు ఇచ్చింది ఈ జంట.
నయనతార, విగ్నేష్ మీడియాతో ఏమి మాట్లాడలేదు. కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
నయనతార పుట్టింది సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో. కానీ ఆరేళ్ళ క్రితం ఆమె హిందూ మతంలోకి మారారు. ప్రభుదేవాని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె మతం మార్చుకున్నారు. కొన్ని కారణాల వల్ల వీరి బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత విగ్నేష్ తో ప్రేమలో పడిన నయనతార అతనితో ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇంకా హిందువుగానే కంటిన్యూ అవుతున్నారు. తరుచుగా ఈ జంట గుడుల చుట్టూ తిరుగుతుంటుంది.