చిరంజీవికి చెల్లెలుగా నయనతార కన్ ఫర్మ్

Nayanthara

చిరంజీవి హీరోగా ఇటీవల మొదలైన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నయనతార చెల్లెలుగా నటించనుంది. ఆమెకి జోడిగా యువ హీరో సత్యదేవ్ నటిస్తారు. సత్యదేవ్ లాంటి చిన్న హీరో సరసన నటించేందుకు నయనతార బెట్టు చేస్తోందని కొన్ని వెబ్ సైట్స్ లో వచ్చిన వార్తలు నిజం కాదని, జనవరి నుంచి నయనతార ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటుందని ఇటీవలే తెలుగుసినిమా.కామ్ రాసింది. తాజాగా ఆ మూవీ టీం నుంచి కన్ ఫర్మేషన్ వచ్చింది.

Advertisement

ఈ రోజు నయనతార పుట్టిన రోజు. ఆమెకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘గాడ్ ఫాదర్’ టీం ఒక పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో నయనతార నటిస్తోందని అలా కన్ఫర్మ్ చేశారు మేకర్స్.

ఈ సినిమా కథ ప్రకారం చిరంజీవికి సిస్టర్ గా నయనతార కనిపిస్తారు. ఆమెకి రెండో భర్తగా సత్యదేవ్ నటించనున్నారు. అతనే ఈ సినిమాలో విలన్ కూడా.

నయనతార ఇంతకుముందు ‘సైరా’లో మెగాస్టార్ కి భార్యగా నటించగా, ఇందులో చెల్లెలుగా మారడం విశేషం. ఐతే, ‘సైరా’లో కూడా చిరంజీవి, నయనతార మధ్య పెద్దగా రొమాంటిక్ సీన్లు లేవు. నయనతార ఈ సినిమాలో నటించేందుకు నాలుగు కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

Advertisement
 

More

Related Stories